ప్రమాదంలో వ్యాపారులు మృతి.. కారులో కోటి రూపాయల బంగారం

360

కారు ప్రమాదంలో ఇద్దరు బంగారు వ్యాపారులు మృతి చెందారు.. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రాజీవ్ రహదారిపై మల్యాలపల్లి మలుపు వద్ద జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు బంగారం వ్యాపారులు మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబుగా గుర్తించారు. గాయపడిన సంతోష్ కుమార్, సంతోష్ లను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు వ్యాపారులు తెలంగాణలోని వివిధ బంగారు దుకాణాలకు బంగారం విక్రయిస్తుంటారు. ప్రమాదం జరిగినప్పుడు వీరి వద్ద కోటి రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రమాదం స్థానికుల సమాచారం ఘటన స్థలికి వచ్చిన 108 సిబ్బంది బంగారు ఆభరణాలను గుర్తించి పోలీసులకు అప్పగించారు. నిజాయితీగా బంగారు ఆభరణాలు అప్పగించిన 108 సిబ్బందిని రామగుండం ఎస్ఐ శైలజ అభినందించారు.

ప్రమాదంలో వ్యాపారులు మృతి.. కారులో కోటి రూపాయల బంగారం