కర్నూలు రోడ్డు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

87

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం ఎర్రగుంట వద్ద జాతీయరహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. క్రిస్మస్ సందర్బంగా క్రైస్తవులు వేకువజామున కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఈ సమయంలోనే జాతీయ రహదారిని దాటుతుండగా ఓ డీసీఎం వ్యాన్ అతివేగంతో వచ్చి ఢీకొంది..

ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కొందరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపెరిండెంట్లకు తెలిపారు.

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. కాగా ప్రమాదంలో గాయపడిన వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గుంపుగా వెళ్లడం మూలంగా ఇంతమంది గాయపడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇక డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు పోలీసులు.

కర్నూలు రోడ్డు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య