Anantapur Accident :- ఓ చేతిలో బీరు.. మరో చేతిలో స్టీరింగ్.. నలుగురి ప్రాణం తీసింది

182

నిర్లక్ష్యం, మద్యం మత్తు నలుగురి ప్రాణాలు తీసింది. ఓ చేతిలో బీరు బాటిల్ పట్టుకొని.. మరో చేతితో స్టీరింగ్ పట్టుకొని అతివేగంతో గుర్తు తెలియని వాహనాన్ని వెనకనుంచి ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుగొండ కీయ పరిశ్రమ సమీపంలో చోటుచేసుకుంది. రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఉండటంతో ముందు వెళ్తున్న వాహనం స్లో అయింది. దీనిని గమనించించకుండా వేగంతో వచ్చిన కారు వెనకనుంచి నుంచి ఢీకొంది. దింతో కారు నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలకు కారులో ఇరుక్కుపోయాయి.

కారు నడుపుతున్న వ్యక్తి చేతిలో బీరు బాటిల్ కనిపించింది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడం మూలంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో బెంగళూరుకు చెందిన మనోజ్‌మిట్టల్‌, దిల్లీకి చెందిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు మృతి చెందారు. వీరి మృతదేహాలను జేసీబీ సాయంతో కారులోంచి బయటకు తీశారు. అనంతరం పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఓ చేతిలో బీరు.. మరో చేతిలో స్టీరింగ్.. నలుగురి ప్రాణం తీసింది