బైంసాలో మరోసారి అల్లర్లు.. పోలీసులకు గాయాలు

15308

నిర్మల్ జిల్లా బైంసాలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆదివారం రాత్రి సమయంలో ఘర్షణలు జరగ్గా చాలామంది గాయపడ్డారు. రెండు వర్గాలు రోడ్లపైకి వచ్చి బాహాబాహీకి దిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ వర్గం వారు మరో వర్గం దుకాణాలను, వాహనాలను తగులబెట్టినట్లు తెలుస్తుంది. దింతో పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం జరిగింది. ఘర్షణలో రాళ్ళూ రువ్వుకోవడంతో అనేక మందికి తలలు పగిలాయి. పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు ఎలెక్ట్రానిక్ మీడియా సభ్యులు గాయపడ్డారు. గాయపడిన వారిని హైదరాబాద్ తరలించారు.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఘర్షణను ఆపేందుకు ఎంత ప్రయత్నం చేసిన అదుపులోకి రాలేదు. దింతో ప్రత్యేక బలగాలను దింపారు. ఫైర్ సిబ్బంది దుకాణాల్లోని మంటలను ఆర్పారు. బైంసా డీఎస్పీ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విశ్వ వారియర్‌ భైంసా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చిన్న పిల్లలు, మహిళలు కూడా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక, గతేడాది కూడా భైంసాలో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

బైంసాలో మరోసారి అల్లర్లు.. పోలీసులకు గాయాలు