బీజేపీపై హాట్ కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి

131

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ తెలంగాణలో బీజేపీ గెలుపు గాలివాటకు గెలుపని అన్నారు. దుబ్బాకలో గెలిచిన బీజేపీ హుజుర్ నగర్ లో డిపాజిట్లు కూడా సాధించలేకపోయిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీది గాలివాటకు గెలుపని అన్నారు.

తాను బీజేపీలోకి వెళ్లానని స్పష్టం చేశారు. వెల్లవాడిని అయితే 2017లోనే వెళ్లాలని కానీ తాను బీజేపీలోకి వెళ్లానని. కాంగ్రెస్ లోనే ఉంటానని తెలిపారు. బీజేపీ అనేది పేపర్ టైగర్ అని తెలిపారు. బీజేపీ విషయంలో మీడియా చేస్తున్న హడావిడి అధికంగా ఉందని తెలిపారు రేవంత్.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు రేవంత్. గతంలో తాము మేయర్ గా చేశామని వివరించారు. కానీ ఇప్పుడు రెండు సీట్లకే పరిమితమైనట్లు తెలిపారు. గతంలో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలి అంటేనే భయపడిందని, కానీ 2016 లో 99 స్థానాలు గెలిచిందని, 2020 వచ్చేసరికి 56 స్థానాలకు పడిపోయిందని తెలిపారు. తాము రెండు స్థానాల్లో విజయం సాధించామని, కానీ గతంలో మేయర్ పీఠాన్ని దక్కించుకుందని గుర్తు చేశారు.