మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ ఆరెస్ట్ చేయండి : నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు

380

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. మంత్రి పెద్దిరెడ్డిపై తక్షణ చర్యలకు ఎస్ఈసి ఆదేశించారు.. ఈనెల 21 వరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చెయ్యాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఎస్ఈసి పేర్కొన్నారు. ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఇలాంటి చర్యలు తప్పవని ఎస్ఈసీ స్పష్టం చేశారు.