ఆర్‌బీఐ పాలసీ రివ్యూ : 4 శాతంగా రెపోరేటు?

151

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) నేడు ఆర్‌బిఐ విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. COVID-19 మహమ్మారి మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2021 బడ్జెట్‌ను సమర్పించిన తరువాత.. ఆరుగురు సభ్యులతో ఎంపిసి మొదటి సమావేశం జరుగుతోంది. మునుపటి విధాన సమీక్షా సమావేశంలో COVID-19 కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా రిజర్వ్ బ్యాంక్ 2020 మార్చి నుండి తన కీలక రుణ రేటును (రెపో రేటు)ను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

ఇదిలావుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో నిర్ణయంతో రుణ రేటు 4 శాతంగా, రివర్స్‌ రుణ రేటు 3.35 శాతంగా కొనసాగే అవకాశం ఉంది.