ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్

97

లాక్ డౌన్ సమయంలో పేదలకు అండగా నిలిచిన సోనూసూద్ పదికోట్ల రూపాయల ఋణం కోసం తన ఆస్తులను తాకట్టు పెట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్ – నవంబర్ నెల మధ్యలో స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకులో ఈ తనకా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. తాకట్టు పెట్టిన ఆస్తులు ముంబై జుహు లోని శివసాగర్ సిజిహెచ్ఎస్ లో ఆరుప్లాట్లు అలాగే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న రెండు షాప్ లని తెలుస్తోంది. ఈ ప్లాట్లు ఇస్కాన్ ఆలయానికి సమీపంలో ఉన్నాయి. వీటికి ప్రతి నెలా లక్షల్లో అద్దె వస్తోంది. కాగా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల తోపాటు పలువురు పేదలకు ఆర్ధిక సాయం అందించి అందరి మన్ననలు పొందారు సోను.