సజ్జలను తప్పించండి : గవర్నర్ కు ఎస్ఈసి లేఖ

180

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విధుల నుంచి తప్పించాలని గవర్నర్ బిస్వభూషణ్ హరిచంద్ కు లేఖ రాశారు.. ఎన్నికల విధులకు ఆయన ఆటంకిగా మారారని పేర్కొన్నట్టు తెలుస్తోంది.. కాగా ఇదివరకే సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించాలని కోరుతూ.. సీఎస్ కు లేఖ రాసిన నిమ్మగడ్డ ఎన్నికల విధుల్లో ప్రవీణ్ ప్రకాష్ పాల్గొనకుండా చూడాలని ఆదేశించారు.