మోడీ ఫోటోలను తొలగించండి.

207

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకులలో ఉండే మోడీ ఫోటోలను తొలగించాలని ఆదేశించింది. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పెట్రోల్ బంకులలో ఉన్న మోడీ ఫోటోలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని వస్తుందని పశ్చిమ బెంగాల్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మోడీ ఫోటోలను తొలగించాలని తెలిపింది.

ఈ మేరకు ఆయిల్ కంపెనీలకు 72 గంటల సమయం ఇచ్చింది ఎన్నికల సంఘం. ఇదిలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం. పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాక దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో మోడీ ఫోటోలను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దింతో ఆయిల్ కంపెనీకి మోడీ ఫోటోలను తొలగించే పనిలో పడింది.

మోడీ ఫోటోలను తొలగించండి.