సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించండి : ఎస్ఈసి ఆదేశం

140

ఎన్నికల నిర్వహణపై దూకుడుమీదున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ను ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ కు లేఖ రాసిన నిమ్మగడ్డ ఎన్నికల విధుల్లో ప్రవీణ్ ప్రకాష్ పాల్గొనకుండా చూడాలని కోరారు..

కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశించాలని సూచించారు. ఈనెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేసారని.. ప్రవీణ్ ప్రకాష్ పై నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదని లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నట్టు తెలుస్తోంది.