కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు

146

కాంట్రాక్టు ఉద్యోగులు తమను రెగ్యులర్ చెయ్యాలంటూ గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాంట్రాక్టు పద్దతిలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న డిగ్రీ, జూనియర్ కళాశాలల లెక్చరర్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమను క్రమబద్దీకరిస్తారని ఎంతో ఆశపడ్డారు. కానీ ఇప్పటివరకు వారిని క్రమబద్దీకరించలేదు. ఇక ఈ నేపథ్యంలోనే కొందరు వ్యక్తులు 2016 లో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించకుండా ప్రత్యేక్ష నియామకాలు చేపట్టాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించారా అని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం వీరిని క్రమబద్దీకరించలేదనే విషయం కోర్టుకు తెలియడంతో ఈ పిటిషన్ దాఖలు చేసిన 24 మందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం క్రమబద్దీకరించకముందే ఉహించుకొని పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని కోర్టు మండిపడింది. పిటిషన్ వేసిన 24 మందికి తలా రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది హైకోర్టు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు