జగన్ కోసం రాజీనామా చేయడానికి సిద్ధం : పుదుచ్చేరి మంత్రి మల్లాడి

58

జగన్ కోసం రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన బీసీల సంక్రాంతి సభలో ప్రసంగించిన కృష్ణారావు ఈ ప్రకటన చేశారు.. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేసిన తీరును ప్రశంసించారు. తమిళనాడు ప్రజలకు కూడా వైయస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి అవసరం అని మల్లాడి అన్నారు.

పాదయాత్ర చేస్తున్న సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసి గొప్ప ముఖ్యమంత్రిగా జగన్ పేరు తెచ్చుకున్నారని అన్నారు. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న ప్రయత్నంలో తాను భాగస్వామి అవుతానని.. అందుకోసం అవసరం అయితే ‘నా పదవికి రాజీనామా చేసి జగన్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని కృష్ణారావు వ్యాఖ్యానించారు. కాగా నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 56 బిసి కార్పొరేషన్ల అధ్యక్షులు, 672 మంది కొత్త డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.