భారత్ తో చర్చలకు సిద్ధం :- ఇమ్రాన్‌ ఖాన్

851

‌శత్రు దేశం పాకిస్థాన్, భారత్ తో తాము సిద్ధమని చెబుతుంది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి అంటే అది కేవలం చర్చలతోనే పరిష్కారం అవుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ భారత్ ను మచ్చిక చేసుకునేందుకు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించి… ఉగ్రవాదాన్ని రూపు మాపాలి అంటే ఇరు దేశాలు కూర్చొని చర్చించుకోవాలని తెలిపారు. ప్రాంతీయ వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని అన్నారు. భారత్‌తో చర్చలకు తాము ముందుకొచ్చినా పొరుగుదేశం స్పందించలేదని అన్నారు.

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉపఖండంలో వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతిపాదించానని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. వాణిజ్య, వర్తక సంబంధాలను మెరుగుపరచడం ద్వారానే ఉపఖండంలో పేదరికాన్ని రూపుమాపగలమని అన్నారు. అయితే దాయాది దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి ఎవరు స్పందించలేదు.

భారత్ తో చర్చలకు సిద్ధం :- ఇమ్రాన్‌ ఖాన్