సంజయ్‌ బంగర్‌కు ఆర్‌సీబీ కీలక పదవి

129

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వేలానికి ముందు ఫ్రాంచైజ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా భారత మాజీ బ్యాట్స్‌మన్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆర్‌సీబీ ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘IPL2021 కోసం బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సంజయ్ బంగర్‌ను ఆర్‌సిబి ఫ్యామిలీకి స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము! మీకు స్వాగతం, కోచ్!’ అంటూ ఆర్‌సిబి బుధవారం ట్వీట్ చేసింది. కాగా సంజయ్‌ బంగర్‌ గతంలో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టుకు 2014 నుంచి 2017 వరకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.