లోన్ యాప‍్స్‌తో మోసపోతే ఇక్కడ ఫిర్యాదు చేయండి

61

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సీజీఎం యోగేశ్ దయాల్ బుధవారం కీలక ప్రకటన చేశారు. కొన్ని యాప్‌లు.. రుణాల పేరుతొ వ్యక్తుల దగ్గర నుండి అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్లు తెలిసిందని.. అనధికారిక డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాంలు , మొబైల్ యాప్ లకు వ్యక్తులు మరియు చిన్న వ్యాపారులు బలైపోవద్దని హెచ్చరించారు.

ఈ ప్లాట్‌ఫారమ్‌లు అధిక వడ్డీ రేట్ల తోపాటు అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయని.. యాప్ ల ద్వారా రుణాల కోసం వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వవద్దని అన్నారు. వీటివల్ల యాప్ ల ప్రతినిధులు అమాయకులను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఎవరైనా అనధికార యాప్ ల ద్వారా నష్టపోతే వెంటనే sachet.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.