టెస్ట్ సిరీస్‌కు రవీంద్ర జడేజా దూరం?

64

ఆసీస్ తో సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఎడమ బొటనవేలు గాయం కారణంగా భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌తో జరగబోయే హోమ్ టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉంటున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఫిబ్రవరి 5 నుంచి భారత్ నాలుగు టెస్టులు, ఐదు టి 20 లు, మూడు వన్డేలు ఆడనుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనున్నాయి, తరువాతి రెండు టెస్టులు అహ్మదాబాద్ లో జరుగుతాయి.

జడేజాను టీ 20, వన్డేల జట్టులో చేర్చడంపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
‘జడేజా పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాలకు పైగా పడుతుంది. తక్కువ ఫార్మాట్ల కోసం జడేజాను జట్టులో చేర్చాలా వద్దా అని సెలెక్టర్లు తరువాత నిర్ణయిస్తారు’ అని బిసిసిఐ అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు. కాగా జడేజా పునరావాసం కోసం త్వరలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయనున్నారు.