ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు..

80

2015 జరిగిన ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ అధికారులు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ కేసు విషయమై ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు అవినీతి నిరోధక శాఖపరిధిలోకి రాదని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం రేవంత్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అభియోగాల నమోదు కోసం కేసు విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

నిందితులందరూ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జెరూసలేం మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. తాజాగా ఈ కేసుపై జెరూసలేం మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే, చంద్రబాబు మాట్లాడమంటేనే తాను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడానని గతంలో మత్తయ్య మీడియాకు తెలిపారు. కాగా వేము నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు వీరంతా కలిసి స్టీఫెన్ సన్ తో బేరం కుదిర్చారని అభియోగాలు ఉన్నాయి.

ఏసీబీ కోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు..