రేషన్ పంపిణి వాహనదారులకు శుభవార్త చెప్పిన జగన్

82

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే వాహనదారులకు ప్రభుత్వం ప్రతి నెల ఇస్తున్న 16,000 రూపాయలు సరిపోవని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

 ఈ క్రమంలోనే వారికి నెలనెలా ఇస్తున్న రూ.15వేలను రూ.21వేలకు పెంచారు. వాహనాల అద్దెను రూ.10వేల నుంచి 13 వేలు, వాహనదారుడి సహాయకుడికి చెల్లించే హెల్పర్ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5వేలు, పెట్రోల్ ఖర్చులను రూ.3 నుంచి రూ.5వేలకు పెంచారు.

ప్రభుత్వం ఇస్తున్న వాటిలో అద్దె కింద రూ.10 వేలు, పెట్రోల్‌ కోసం రూ.3 వేలు, హెల్పర్‌ చార్జీల కోసం రూ.3 వేలు కేటాయించారు. అయితే ఇది వాహనదారులకు సరిపోవడం లేదు. దింతో వారి సమస్య అర్ధం చేసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో 5 వేల రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

 ప్రస్తుతం ఒక్కో రేషన్ డెలివరీ వాహనదారుడికి ప్రతి నెలా రూ.16 వేలు చెల్లిస్తున్నారు. వాటిలో అద్దె కింద రూ.10 వేలు, పెట్రోల్‌ కోసం రూ.3 వేలు, హెల్పర్‌ చార్జీల కోసం రూ.3 వేలు కేటాయించారు. ఐతే ఆ డబ్బు సరిపోవడం లేదని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్ దృష్టికి వచ్చింది.

దింతో రేషన్ పంపిణి దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వచ్చే నెల నుంచి ఈ మొత్తం అందనుంది. రేషన్ డెలివరీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అధికారులకు నివేదికలు ఇవ్వాలి. రేషన్ డెలివరీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అధికారులకు నివేదికలు ఇవ్వాలి. ఒకవేళ శుభ్రంగా లేకపోతే అదనంగా చెల్లిస్తున్న మొత్తంలో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఒకవేళ శుభ్రంగా లేకపోతే అదనంగా చెల్లిస్తున్న మొత్తంలో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అధికారులు వాహనదారులకు ఫోన్ చేసి వివరాలు చెబుతున్నారు. కాగా, రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం మొత్తం 9260 వాహనాలను అందజేసింది.

 ఒక్కో వాహనం ధర రూ.5,81,000 కాగా.. ప్రభుత్వ సబ్సిడీ కింద రూ.3,48,600 అందజేసింది. ఇక బ్యాంక్‌ లింకేజీ ద్వారా రూ.1,74,357 రుణం మంజూరు చేశారు. ఇందులో లబ్ధిదారుని వాటా కేవలం రూ.58 వేలు. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు వీలుగా పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లిస్తోంది.

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2300, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 700, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 3800, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 660, ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా 1800 మందికి వాహనాలను అందజేశారు.

రేషన్ పంపిణి వాహనదారులకు శుభవార్త చెప్పిన జగన్