Ration ATM: త్వరలో మొదలుకానున్న రేషన్ సరుకులిచ్చే ఏటీఎంలు!

341

Ration ATM: దేశవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ విషయంలో ఇప్పటికే చాలా మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకొనే వెసులుబాటు తీసుకురాగా త్వరలోనే రేషన్ ఇచ్చే ఏటీఎంలు తీసుకురానుంది. సహజంగా ఇప్పటి వరకు మనం ఏటీఎంలో డబ్బులు మాత్రమే తీసుకున్నాం. ఈ మధ్యనే నీటి ఏటిఎంలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా రేషన్ సరకులనే వాటి ద్వారా పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.

తొలుత ప్రయోగాత్మకంగా 5 నగరాల్లో ఈ ప్రాజెక్ట్ను చేపట్టి.. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరిస్తామని అధికారులు తెలిపారు. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకున్న తరహాలోనే రేషన్ బియ్యం, గోధుమలనూ పొందేలా ఆటోమేటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని 5 నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద వీటిపై ప్రయోగం చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు.

ప్రయోగాత్మకంగా.. గుజరాత్లో అమలవుతున్న జాతీయ ఆహారభద్రత పథకం సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు పాండే. ప్రజలు చౌకధరల దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ మిషన్ల ద్వారా సరకు తీసుకొనే వ్యవస్థను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి మిషన్ను ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్ నగరంలో ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారాయన.

Ration ATM: త్వరలో మొదలుకానున్న రేషన్ సరుకులిచ్చే ఏటీఎంలు!