Rashikhanna: నాజూకు అందాలు ఊరికే రావు కదా!

236

Rashikhanna: ఊహలు గుసగుసలాడే సినిమాలో రాశిఖన్నా గుర్తుందా మీకు. బొద్దుగా ముద్దుగా ఉండే రాశీకి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ సినిమా చూసిన కుర్రాళ్లలో అమ్మాయిలంతా నాగశౌర్యకి పడిపోతే అబ్బాయిలంతా రాశిఖన్నాకు పడిపోయారు. కానీ అన్ని సినిమాలలో అలానే బొద్దుగా ఉంటే పనికాదని అనుకున్న రాశీ ఈ మధ్య సన్నబడే పనిపెట్టుకుంది. అందులో భాగంగానే గత ఆరునెలల నుండి డైట్ ఫాలో అవుతూ కోచ్ సలహాలతో సన్నబడుతూ వచ్చింది. ఫైనల్ గా అనుకున్నది సాధించేసా అంటూ ట్విట్టర్ లో ఫోటోలు పెట్టేసింది.

Image

జీరో సైజ్‌లోకి వచ్చిన రాశి బికినీలో ఎంజాయ్ చేసేలా మారిపోయి వరుసగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం రాశీ ఖన్నా వెబ్ సిరీస్ షూటింగ్ కోసం గోవాలో వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ రచ్చ చేసిన రాశీ ఇలా మొదటిసారిగా బికినీలో దర్శనం ఇవ్వడం అందరినీ షాక్ కి గురిచేసింది. హెల్దీ డైట్‌ను మెయింటైన్ చేస్తూనే ఈ సంవత్సర కాలంలో నా ట్రైనర్ నాలో ఇంత మార్పును తీసుకొచ్చాడని ఫుల్ క్రెడిట్ ఇచ్చేసింది.

Image

కాగా ఈ ఏడాది కాలంలో రాశీ పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోగా దాని కోసం నా ట్రైనర్ కూడా ఎంతో స్టడీ చేసి మంచి డైట్ ఇచ్చాడని తెలిపింది. ఇక.. అలా కావాలని అనుకునేవారికి కూడా కొన్ని సలహాలు ఇచ్చేసింది ఈ సుందరి. మీ బాడీ మీద కోపంతో కాదు ఇష్టంతో వర్కవుట్లు చేయండని చెప్పిన రాశీ.. సరైన డైట్ లేకుండా చేస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని.. పైగా నిదానమే ప్రధానం అనే సామెత పాటిస్తే మంచిదంటూ సూక్తులు కూడా చెప్పేసింది. జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందని సన్నగా ఉంటే ఏదైనా చెప్తార్లే అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Image

Rashikhanna: నాజూకు అందాలు ఊరికే రావు కదా!