సొంతపార్టీపై ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు

148

టిఆర్ఎస్ నేత, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. సొంతపార్టీపైనే విమర్శలు గుప్పించారు.. సోమవారం మహబూబాబాద్‎లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో మాట్లాడిన ఆయన.. టిఆర్ఎస్ ను లిమిటెడ్ కంపెనీతో పోల్చారు.. తాను అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానని..

అయినా లిమిటెడ్ కంపెనీలో ఉన్నప్పుడు అందుకు అనుగుణంగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. కలం, గళం మౌనంగా ఉంటే క్యాన్సర్ కన్నా ప్రమాదం అని అన్నారు. కాగా ఎమ్మెల్యే రసమయి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.. పార్టీ నేతలు ఆయన అసంతృప్తికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.