యువతిపై 60 మంది అత్యాచారం

162

ఓ యువతిపై 60 మంది మృగాలు 30 రోజులపాటు అఘాయిత్యం చేశాయి. ఈ ఘటన ఝార్ఖండ్ లో కలకలం రేపుతోంది. సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాలోని కందర్‌బేరా సమీపంలో మూతపడిన గ్యారేజీలో నెల రోజుల పాటు బందించి 60 మంది సదరు యువతిపై అత్యచారం చేశారు. యువతి బహిర్భుమికి వెళ్తానని చెప్పి వారినుంచి చాకచక్యంగా తప్పించుకొని బయటపడింది. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తాను సహకరించకపోతే విపరీతంగా కొట్టారని.. తనకు మత్తుమందు ఇచ్చారని పోలీసుల ముందు యువతి వాపోయింది. వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరింది. కాగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని, అంతకుమించిన వివరాలు చెప్పలేకపోతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు పోలీసులు.

యువతిపై 60 మంది అత్యాచారం