విరాటపర్వం ఫస్ట్ లుక్ రిలీజ్, భారీ కటౌట్ తో కనిపిస్తున్న రానా

93

డిసెంబర్ 14 దగ్గుబాటి రానా పుట్టిన రోజు.. ఈ సందర్భగా ఆయన నటిస్తున్న విరాటపర్వం మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. మరోవైపు అక్కినేని వారి కోడలు సమంత, రానా స్పెషల్‌ డీపీని రిలీజ్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. రానాకు ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. కాగా బ్లాక్‌బస్టర్‌ బాహుబలి మూవీ లోని బల్లాలదేవతో తనప్రత్యేకతను ప్రపంచ వ్యాప్తంగా చాటుకున్న రానా ప్ర‌స్తుతం విరాటప‌ర్వం సినిమాతో మరోసారి భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Image

ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబందించిన టీజర్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాను ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంగీతాన్ని సురేష్ బొబ్బిలి అందిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

విరాటపర్వం ఫస్ట్ లుక్ రిలీజ్, భారీ కటౌట్ తో కనిపిస్తున్న రానా