దేవభూమి కొత్త ముఖ్యమంత్రిగా రమేష్ పోఖ్రియాల్

468

దేవభూమి ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా కేంద్ర విద్యాశాఖామంత్రి రమేష్ పోఖ్రియాల్ ఎన్నిక లాంఛనం కానుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ ను బీజేపీ తప్పించ నుంచి. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి పోఖ్రియాల్ బాధ్యతలు తీసుకోనున్నారు. బీజేపీ తమ మూలసిద్ధాంతం అయినా ఐదేళ్ల కొనసాగింపును త్రివేంద్ర సింగ్ రావత్ విషయంలో పక్కన పెట్టింది.

త్రివేంద్ర సింగ్ రావత్ ను తప్పించడం వెనక పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తుంది. ఇయ్యనపై రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగినట్లుగా కేంద్ర పెద్దలకు సంకేతాలు అందాయి. వరదల సమయంలో సరిగా స్పందించలేదనే ఆరోపణలు కూడా ఎదురుకుంటున్నారు త్రివేంద్ర సింగ్.. ప్రజలతోపాటు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో రావత్ ను పక్కకు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ రోజు జరగనున్న బీజేఎల్పీ భేటీకి రమేష్ పోఖ్రియాల్ హాజరు అవుతున్నారు. అందరు రమేష్ పోఖ్రియాల్ ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రి అంటూ ఫిక్స్ అయిపోయారు. హరిద్వార్ పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు విజయం సాధించిన పోఖ్రియాల్ కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం ఆయన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు రమేష్. అయితే కేంద్ర మంత్రి వర్గంలోకి త్రివేంద్రను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆయనను రాష్ట్ర రాజకీయాల్లోంచి తప్పించి కేంద్రంలో కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేవభూమి కొత్త ముఖ్యమంత్రిగా రమేష్ పోఖ్రియాల్