రామతీర్థంలో విజయసాయిరెడ్డి కారుపై చెప్పులతో దాడి

111

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాములోరి విగ్రహం ధ్వంసం అయిన గుడిని సందర్శించేందుకు శనివారం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ నేతలు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

సందర్శించటానికి వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై కొంత మంది ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. అయితే టీడీపీ, బీజేపీ పార్టీలు ముందుగానే ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం హఠాత్తుగా తన పర్యటన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొండపైకి వెళ్లి ఆలయంలో ధ్వంసం అయిన విగ్రహాన్ని చూసి కిందకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.

రాళ్ల దాడిలో ఎంపీ కారు అద్దాలు పగిలాయి. దీంతో ఆయన కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి, ఆ తర్వాత మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే టీడీపీ, బీజేపీ శ్రేణులే ఈ ఏడాదికి పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ ఉదృక్త పరిష్టితి చోటుచేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.

రామతీర్థంలో విజయసాయిరెడ్డి కారుపై చెప్పులతో దాడి