మ‌రో రామాల‌యంపై దాడి – సీత‌మ్మ విగ్ర‌హం ధ్వంసం..!

94

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. గడిచిన 18 నెలల్లో 100పైగా దేవాలయాలపై దాడులు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. రథాలను తగులబెట్టారు. ఇక తాజాగా రామతీర్థంలో కోదండరామస్వామి విగ్రహ తలను మొండాన్ని వేరు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వ్యవహారం దుమారం లేపుతుంది.

ఇది ఇలా ఉండగా కృష్ణా జిల్లా విజ‌య‌వాడ‌లో మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది. న‌గ‌రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న రామాల‌యంపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడి చేశారు. సీతమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిత్యం ప్ర‌యాణికులతో రద్దీగా ఉండే ప్రాంతంలో సీత‌మ్మ విగ్ర‌హం ధ్వంసంపై భ‌క్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.