రామమందిర నిర్మాణానికి గౌతమ్ గంబీర్ భారీ విరాళం

326

అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా భారీ స్థాయిలో రామయ్యకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించారు.

కోటిరూపాయల చెక్కును రామతీర్థ ట్రస్ట్ కు అందచేశారు. ‘‘అద్భుతమైన రామ మందిర నిర్మాణం అనేది భారతీయుల అందరి కల. ఎట్టకేలకు అది నెరవేరబోతోంది. ప్రశాంతత, ఐకమత్యానికి ఇది బాటలు వేస్తుంది. ఈ నేపథ్యంలో నా వంతుగా నా కుటుంబం తరఫున చిన్న విరాళం’’ అని గౌతం గంభీర్‌ ప్రకటన విడుదల చేశారు.

 

రామమందిర నిర్మాణానికి గౌతమ్ గంబీర్ భారీ విరాళం