చరణ్, యష్ తో శంకర్ మల్టీస్టారర్

433

డైరెక్టర్ శంకర్.. విభిన్నమైన కథలను తెరకెక్కించడంలో దిట్ట.. భారీ గ్రాఫిక్స్, సెట్టింగ్స్ ఆయన స్పెషాలిటీ. భారతీయుడు సీక్వల్ భారతీయుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శంకర్.. ఈ సినిమా తర్వాత ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి ఈ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగాహీరో రామ్ చరణ్, kgf స్టార్ యష్ హీరోలుగా ఓ చిత్రాన్ని తీయాలనుకుంటున్నారంట శంకర్. ఈ చిత్రం చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో ఉంటుందని సమాచారం.

భారతీయుడు 2 సినిమా షూటింగ్ పూర్తి కాగానే, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లుగా తమిళ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. 2022 రెండో భాగంలో చిత్రీకరణ ప్రారంభం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా చరణ్, యష్ హీరోలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2022 జనవరిలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారంట శంకర్.. అయితే ఈ చిత్రం రెండు పార్ట్స్ గా ఉంటుందని సమాచారం.

చరణ్, యష్ తో శంకర్ మల్టీస్టారర్