గుడ్ న్యూస్ చెప్పిన రకుల్ ప్రీత్

1343

టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత వారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ రకుల్ స్వయంగా తెలిపారు. ఇక కరోనా రావడంతో ఇంట్లోనే ఉంటున్నారు రకుల్.. ఈ ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. తాజగా అభిమానులతో ట్విట్టర్ లో ముచ్చటించారు అమ్మడు.. తాను కరోనా నుంచి బయటపడేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇక తాజాగా తనకు కరోనా నెగటివ్ వచ్చినట్లు తెలిపింది రకుల్. క్షేమంగా ఉన్నానని తెలిపారు. అభిమానుల ప్రేమ ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. 2021 ను పాజిటివ్ దృక్పథంతో మొదలు పెట్టాలని అనుకుంటున్నాని రకుల్ తెలిపారు. కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు రకుల్.

గుడ్ న్యూస్ చెప్పిన రకుల్ ప్రీత్

Image