రజినీకాంత్ పార్టీ గుర్తు ఆటో

298

తమిళనాట వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార ఏఐడిఎంకే ప్రజల్లోకి వెళ్లి తాము చేసిన అభివృద్ధిని గురించి వివరిస్తుండగా. ప్రతిపక్ష డీఎంకే తాము అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల గురించి వివరిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే సినీ అగ్రహీరోలు కూడా ఈ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

కమల్ హాసన్ అభ్యర్థుల లిస్ట్ పై ద్రుష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఆయనకు టార్చ్ లైట్ గుర్తు కేటాయించగా ఈ సారి మారె అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కమల్, ఎఐఎంఐఎంతో కలిసి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక రజినీకాంత్ పార్టీపేరు కన్ఫర్మ్ అయింది. మక్కల్ సేవై కట్టి పేరును ఒకే చేశారు. మక్కల్ సేవై కట్టి అంటే తెలుగులో ప్రజాసేవ పార్టీ అని అర్ధం. పార్టీ గుర్తు సైకిల్ కోరగా అది రానట్లు సమాచారం. ఆటో గుర్తు కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

 

రజినీకాంత్ పార్టీ గుర్తు ఆటో