రజిని పొలిటికల్ ఎంట్రీకి బాగా సరిపోయే ఐదు ప్రముఖ డైలాగులు

145

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన పొలిటికల్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు. కానీ చాలా సంవత్సరాలుగా తన సినిమాల్లో పలు పాపులర్ డైలాగ్స్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం గురించి సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. రజిని 70వ పుట్టినరోజు సందర్భంగా, ఆయన రాజకీయ ఆశయానికి బాగా సరిపోయే తన సినిమాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐదు డైలాగ్‌లను పరిశీలిద్దాం..

నరసింహ : రజనీకాంత్ తన పార్టీని ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నందున ‘నా దారి రహదారి’ అనే పంచ్ డైలాగ్ బాగా వాడుకలోకి వచ్చింది. ఈ డైలాగ్ ని పొలిటికల్ భాషలో చెప్పాలి అంటే.. ఇతర ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని చాలా మంది ఆశించే సమయంలో, రజనీకాంత్ తనదైన మార్గాన్ని ఎంచుకున్నారన్న విషయం అర్ధం చేసుకోవచ్చు.

ముత్తు : ‘నేను ఎప్పుడు, ఎలా వస్తానో ఎవరికి తెలియదు. కానీ సరైన సమయంలోనే వస్తాను’. అప్పట్లో ఈ డైలాగ్ పెద్ద సంచలనమే అయింది. ఈ ఫేమస్ డైలాగ్ ను పరిశీలిస్తే.. రజినీకాంత్ రాజకీయాల్లో వస్తారని చాలా రోజులుగా అనుకుంటున్నారు.. అదే విధంగా ఏదైనా పార్టీలో చేరతారా? లేక సొంత పార్టీ పెడతారా? అనే విషయంపై స్పష్టత లేదు కానీ మొత్తానికి రజిని స్టయిల్లోనే చూస్తే రాజకీయాల్లోకి అసెంబ్లీ ఎన్నికలకు ముందే వచ్చారన్నది అర్ధం చేసుకోవచ్చు.

బాబా : రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని పూర్తిగా సమర్థించగల మరో డైలాగ్ బాబా నుండి.
వచ్చిన (నేను ప్రవేశించే సమయం వచ్చింది, మీరు వెళ్ళే సమయం వచ్చింది). రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్సిన తరువాత ఇతర పార్టీల నేతలు ఇంటికి వెళ్లే సమయం వచ్చిందనే విధంగా అర్ధం చేసుకోవచ్చు.

బాషా : (నేను ఏదైనా ఒకసారి చెబితే, వందసార్లు చెప్పినట్లు). రజినీకాంత రాజకీయాల్లోకి రావడం ఆలస్యం అయిందని ప్రజలకు వివరించడానికి బాషా చిత్రం నుండి వచ్చిన ఈ డైలాగ్ బాగా ఉపయోగపడుతుంది. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తానని ఆయన చాలా కాలం క్రితం చెప్పారు. అందువల్ల ఈ మాట వందసార్లు చెప్పినదానితో సమానమని చెప్పవచ్చు.

శివాజీ : రజనీకాంత్ సొంత పార్టీని ప్రారంభించడం పెద్ద విషయం. ఆయన ఒక్కడే ఏమి సాధించగలడని సందేహిస్తున్నట్లయితే, ఖచ్చితమైన సమాధానం అందించే సంభాషణ ఇక్కడ ఉంది. (పందులు మాత్రమే గుంపులుగా వస్తాయి. సింహం ఎప్పుడూ సింగిల్ గా వస్తుంది) అనే పంచ్ డైలాగ్ వింటే రజిని ఒక్కడే రాజకీయాలను శాసించగలడన్న అభిప్రాయం కలగకమానదు.