పార్టీ ఏర్పాటుపై రజినీకాంత్ వెనకడుగు

45

పార్టీ ఏర్పాటుపై రజినీకాంత్ వెనకడుగు వేశారు.. ప్రస్తుతానికి పార్టీ ఏర్పాటు చేయలేనని ప్రకటించారు.. ఆశలు పెట్టుకున్న అభిమానులను క్షమాపణ కోరుతున్నానని అన్నారు.. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీల లేఖ రాశారు రజిని.. కాగా ఈ నెల 31న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని రజిని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కుటుంబసభ్యుల ఒత్తిడితో బ్యాక్ స్టెప్ వేసినట్టు తెలుస్తోంది.

రాజకీయాలు తమ జీవితంలోకి వచ్చిన తర్వాతే మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయాయని రజనీ కూతుళ్లు ఆయన వద్ద వాపోయినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ నెల 27న శరీరంలో బీపీ లెవల్స్‌ హెచ్చుతగ్గులు కావడంతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కోలుకున్నాక చెన్నైకి వెళ్లారు.