మరో గుదిబండ.. రైల్వేస్ స్టేషన్ లోకి వెళ్లాలంటే రూ.30 చెల్లించాల్సిందే

148

నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దింతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశానికి అంటాయి. వంట నూనె కొండెక్కి కూర్చుంది.. లీటర్ 80 నుంచి 150 కి చేరింది వంట నూనె..ఇది సామాన్యులకు గుదిబండలా మారింది. ఇక వారానికి ఓ సారి పెరుగుతున్న గ్యాస్ రేట్లు కోలుకోకుండా దెబ్బ తీస్తున్నాయి. ఇదిలా ఉంటే రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ రేటు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం రూ.10 గా ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ను రూ.30 కి చేసింది. లోకల్ రైలు టికెట్ చార్జీలను కూడా భారీగా పెంచింది.

లోకల్ రైలు కనీస ఛార్జి రూ.30 గా నిర్ణయించారు. కరోనా మహమ్మారి సమయంలో అనవసర ప్రయాణాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే ఛార్జీలను పెంచినట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటం కోసమే తాత్కాలికంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇప్పటి వరకూ 65 శాతం రైళ్లు మళ్లీ పట్టాలెక్కినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

మరో గుదిబండ.. రైల్వేస్ స్టేషన్ లోకి వెళ్లాలంటే రూ.30 చెల్లించాల్సిందే