Rahul gandhi : వివాదాస్పదమైన రాహుల్ ట్వీట్

160

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ప్రపంచ నియంతల పేర్లన్నీ M తోనే ప్రారంభమయ్యాయని తాజాగా ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో మార్కస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో తదితరుల పేర్లను రాహుల్ ఉదహరణగా చూపించారు. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్ నేతలు ఈ ట్వీట్ ను సమర్థిస్తూ బీజేపీపై సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తున్నారు. కాగా రాహుల్ చేసిన ట్వీట్ రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ హయంలో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ పేరు కూడా ‘M’తోనే మొదలవుతుంది కదా? అంటూ రాహుల్‌ని ప్రశ్నిస్తున్నారు.

ఇక రాహుల్ గాంధీ ట్వీట్ కు విపరీతమైన రిప్లైలు వస్తున్నాయి. దింట్లో కొందరు రాహుల్ గాంధీని తప్పు బడుతుంటే మరికొందరు ఆయన ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక త్వరలో ఐదు రాష్ట్రాల ఇన్నికలు ఉండటంతో రాహుల్ వేగం పెంచారు. గత నెలలో ప్రపంచ టూర్ వెళ్లొచ్చిన రాహుల్ అనంతరం తమిళనాడులో విస్తృతంగా పర్యటించారు. సభలు సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపారు. పొత్తులపై కసరత్తులు చేసి సీట్ల లెక్కలు తేల్చేందుకు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ

 

Rahul gandhi : వివాదాస్పదమైన రాహుల్ ట్వీట్