బడ్జెట్ పై స్పందించిన రాహుల్ గాంధీ

248

కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పేదలకు ఊతమిచ్చేలా నగదు బదిలీ ప్రస్తావనే లేదని అన్నారు. పేదలను బాగుచేద్దామనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. పెట్టుబడి దారులకు దోచిపెట్టే విధంగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు.

మరోవైపు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ బడ్జెట్ పై ప్రశంశల జల్లు కురిపించారు. వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వెయ్యడం మంచి పరిణామమని అభివర్ణించారు. 70శాతం దేశ జనాభా ఈ రంగం మీదనే ఆధారపడి ఉందని తెలిపారు. చిన్న పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇవ్వడం వలన స్టార్తప్స్ పెరుగుతాయని, దింతో ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయని వివరించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ బడ్జెట్ ఉందని వివరించారు.

మరోవైపు బడ్జెట్ పై ఆంధ్ర ప్రజలు గుర్రుమంటున్నారు. రాష్ట్రానికి ప్యాకేజి కానీ, పోలవరం విషయం కానీ బడ్జెట్ లో ప్రస్తావించలేదని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ను చిన్న చూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ తోపాటు టీడీపీ నేతలు కూడా బడ్జెట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పేద ప్రజలకు ఈ బడ్జెట్ ఈ విధంగా మేలు చెయ్యడని చెబుతున్నారు.

బడ్జెట్ పై స్పందించిన రాహుల్ గాంధీ