భూకంపమొచ్చినా అంత ప్రశాంతంగా ఎలా ఉన్నావ్ రాహులా?!

262

మనం ఇంట్లోనో.. ఆఫీసులోనో ఉన్నప్పుడు భూకంపం వస్తే ఏం చేస్తాం.. చేసేది ఎంత ఇంపార్టెంట్ పనైనా అక్కడే వదిలేసి ముందు రోడ్డు మీదకి పరిగెడతాం. అది మనకి తెలియకుండానే దానంతటదే జరిగేపోయే ప్రక్రియ. శుక్రవారం సాయంత్రం తజకిస్థాన్‌లో భూకంపం వచ్చింది… దాని ప్రకంపనలు ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో కనిపించాయి. భూకంపం వచ్చిన సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు పరుగులు తీశారు. కానీ ఒక్క కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం పక్కనే భూమి కంపిస్తున్నా కనీసం చలనం లేదు. పైగా నవ్వుతూ అంతా కదిలిపోతుంది.. ఇదేదో భూకంపం అనుకుంటా అంటూ నవ్వుతూ కూర్చున్నారు.

తజకిస్థాన్‌లో భూకంపం వచ్చిన సమయంలో మన ఉత్తర భారత్‌లోని ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అదే సమయంలో రాహుల్ గాంధీ ఢిల్లీలో తన ఇంట్లో నుండి చికాగో యూనివర్శిటీ విద్యార్థులతో జూమ్‌లో వర్చువల్ ఇంటరాక్టింగ్ అవుతున్నారు. లైవ్ లో ఉండగానే ఇల్లంతా షేక్ అవుతుంది. దీనిపై స్పందించిన రాహుల్ ఇల్లంతా షేక్ అవుతుంది.. బహుశా భూకంపం కావచ్చని జూమ్ లో ఉన్నవారితో అన్నారు. ఏ మాత్రం ప్రకంపనల భయమేలేని రాహుల్ రెండు సెకన్ల పాటు నవ్వుతూ ఆ విషయాన్నీ వారితో చెప్పి అక్కడితో వదిలేసి విద్యార్థుల విషయాల్లోకి వెళ్లిపోయారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇల్లు కంపిస్తున్నా రాహుల్ మాత్రం నవ్వుతూ ప్రశాంతంగా కూర్చోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. భూకంపమొచ్చి మీద పడుతుంటే అంత ప్రశాంతంగా ఎలా కూర్చున్నావ్ రాహులా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భూకంపమొచ్చినా కదల్లేదంటే అది గుండె కాదురా.. ఆ గుండె బతకాలి అంటూ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు ఇదే ట్రేండింగ్ గా మారింది.

భూకంపమొచ్చినా అంత ప్రశాంతంగా ఎలా ఉన్నావ్ రాహులా?!