Radhesyam Update: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!

197

Radhesyam Update: ప్రభాస్ అభిమానులకు రాధేశ్యాం సినిమా యూనిట్ గుడ్ న్యూస్ చెప్పేసింది. సాహో సినిమా తర్వాత రెబల్ స్టార్ అభిమానులు తర్వాత సినిమా అప్డేట్ ఏంటా అని చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ వరసగా మూడు సినిమాలు లైన్లో పెట్టేశాడు. అందులో రాధేశ్యాం ఇప్పటికే ముమ్మర షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టీజర్లు కూడా విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ ప్రకటించేసింది. వేలంటైన్ డే కానుకగా రాధేశ్యాం టీజర్ విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు.

వేలంటైన్ డే రోజున టీజర్ అనగానే ఈ సినిమా ఎలా ఉండబోతుందో కూడా మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. 1980 దశకంలో యూరప్‌ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కించారు. సహజంగానే హీరోను అందంగా చూపించే జిల్ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాలో ప్రేమికుడిగా ప్రభాస్‌ను వినూత్న పంథాలో ఆవిష్కరించినట్లుగా తెలుస్తుంది. విక్ర‌మాదిత్య పాత్ర‌లో ప్రభాస్ కనిపించనుంటే పూజా ప్రేర‌ణ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ మూవీ కథ మునుపెన్నడూ చూడ‌ని విధంగా ఉంటుంద‌ని తెలుస్తుంది.

ఫిబ్ర‌వ‌రి 14 ఉద‌యం 9.18 ని.ల‌కు సినిమా గ్లిమ్ప్స్‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సినిమా ప్రకటించగా ప్రభాస్ అభిమానులు ఇప్పటి నుండే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఆ టీజర్ ఎలా ట్రెండింగ్ చేయాలా అని అభిమాన సంఘాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా టీజర్ల తర్వాత ఈ అంచనాలు ఏ స్థాయికి వెళ్తాయో చూడాల్సి ఉంది.

Radhesyam Update: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!