మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

101

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా సోకింది. రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా నిర్దారణ అవడంతో హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. గత వారం రోజుల్లో తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కాగా గత వారం అజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. గతంలో వేలలో నమోదైన కేసులు ఇప్పుడు వందలకు చేరింది. మరణాల సంఖ్య కూడా తగ్గింది. తెలంగాణలో 2,78,108 మంది కరోనా బారినపడ్డారు. 1,496 మంది కరోనాతో మృతి చెందారు.