పూణే : సీరం ఇన్స్టిట్యూట్ లో అగ్నిప్రమాదం

215

పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సీరం ఇన్స్టిట్యూట్ టెర్మినల్ 1 గేట్ వద్ద గురువారం మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించింది. ప్రస్తుతం మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. అయితే అగ్నిప్రమాదం వలన వ్యాక్సిన్ తయారీకి ఎటువంటి ఆటంకం లేదని సీరం ఇన్స్టిట్యూట్ తెలియజేసింది.