పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం

307

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలింది. సోమవారం జరిగిన బలపరీక్షలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. దింతో ఆయన రాజీనామా లేఖతో రాజ్ భవన్ కు వెళ్లారు. రాజ్ భవన్ లో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు. కాగా గత కొంత కాలంగా పుదుచ్చేరిలో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ కూటమికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆదివారం మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దింతో సోమవారం బలపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో నారాయణస్వామి విఫలం కావడంతో రాజీనామాకు సిద్ధమయ్యారు.

33 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలకు కలిపి 18 మంది సభ్యుల బలం ఉండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా నాలుగున్నర సంవత్సరాలకు పైగా ప్రభుత్వాన్ని కొనసాగింది. ఐతే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దింతో కాంగ్రెస్ కూటమి బలం 18 నుంచి 12కి పడిపోయింది. దింతో బలపరీక్ష నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. సోమవారం బలపరీక్ష నిర్వహించగా నారాయణస్వామి విఫలమయ్యారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలు తమ పదవులకు కూడా రాజీనామా చెయ్యడంతో 26 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అంటే 15 మంది ఎమ్మెల్యేల బలం కావలసి ఉంది. కానీ కాంగ్రెస్ కూటమికి 12 మంది మాత్రమే ఉన్నారు. దింతో బలపరీక్షలో ఓడిన నారాయణస్వామి రాజీనామా లేఖతో రాజ్ భవన్ కు వెళ్లి లైఫ్ నెంట్ గవర్నర్ తమిళిసైని కలిశారు

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం