పబ్జీ చిచ్చు.. రెండు గ్రామాల మధ్య ఘర్షణ

272

దేశంలో పబ్జీ ఎందరో జీవితాలను నాశనం చేసింది. ఈ గేమ్ కు చాలామంది బానిసలైపోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. దీనికి బానిసై మానసికంగా కుంగిపోయి పిచోళ్లు అయినవారి చాలామంది ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్ బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లై స్టోర్లలో లేకుండా చేసింది. అయితే కొంతమంది ఇతర మార్గాల్లో పబ్జీ ఇంస్టాల్ చేసుకొని ఆడుతున్నారు.. ఇలా చేసి రెండు గ్రామంల మధ్య చిచ్చుపెట్టారు కాలేజీకి వెళ్లే యువకులు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. నూజివీడులోని కాలేజీ నుంచి బస్సులో వెళుతూ… కొత్తూరు తండా, సిద్దార్ధనగర్ విద్యార్థులు పబ్జీ ఆడారు.

ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాద జరిగింది. మాటా మాటా పెరిగి బాహాబాహీకి దిగారు. బస్సులోనే తన్నుకున్నారు.. అంతటితో ఆగకుండా గొడవను రెండు గ్రామాలకు పూశారు.. ఇంకేముంది రాడ్లు కర్రలు.. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో రెండు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులుకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు గ్రామాల పెద్దలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు గ్రామాల్లో పోలీసులను మోహరించారు. పలువురిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

పబ్జీ చిచ్చు.. రెండు గ్రామాల మధ్య ఘర్షణ