బీజేపీలోకి పీటీ ఉష

866

భారత మాజీ రన్నర్.. పరుగుల రాణి పీటీ ఉష బీజేపీలో చేరనున్నారు. కేరళలో మార్చి నెలలో బీజేపీ యాత్ర తలపెట్టింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ నాయకత్వంలో ఈ యాత్ర సాగనుంది.. దీనిని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు. మార్చి 2 న ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అదే రోజు పీటీ ఉష బీజేపీలో చేరనున్నారు. యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఉష బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. మరో వైపు మెట్రో మన్ శ్రీధరన్ కూడా ఇదే రోజు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. యోగి సమక్షంలో ఆయన బీజేపీలో చేరతారని ఆ పార్టీ నేతలు మీడియాకు తెలిపారు.

ప్రస్తుతం ఓ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్న ఉష, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని సన్నిహితులనుంచి సమాచారం అందుతుంది. 56 ఏళ్ల పీటీ ఉషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె శిష్యులు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. పిటి ఉషతోపాటు మరికొంతమంది నాయకులు బీజేపీలో చేరుతారని కె సురేంద్రన్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని వివరించారు. యువత బీజేపీపై ఆసక్తి చూపుతుందని సురేంద్రన్ వివరించారు. త్వరలో మరికొందరు నేతలు బీజేపీలో చేరుతారని మీడియాకు వివరించారు సురేంద్రన్

బీజేపీలోకి పీటీ ఉష