హైదరాబాద్ లో సైకో కిల్లర్.. 16 మంది మహిళలను చంపాడు

198

ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకొని.. వారితో మాటలు కలిపి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి హత్యచేస్తున్న సైకో కిల్లర్ ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ కు చెందిన వెంకటమ్మ అనే మహిళను కిరాతకంగా హత్యచేసిన ఘటనలో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో 20 రోజులపాటు విచారణ చేపట్టిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు.

వెంకటమ్మతోపాటు మరో 15 మంది మహిళలను కొందరు పురుషులను కూడా హత్యచేసినట్లు విచారణలో గుర్తించారు పోలీసులు. కల్లు దుకాణాలు, మద్యం షాపుల దగ్గర ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసుకుని ఈ హత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్నవారితో మాటలు కలిపి. వారిని తన దారిలోకి తెచ్చుకునే సైకో.. వారిని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి దారుణాలకు ఒడిగట్టినట్టు పోలీసులు తేల్చారు. ఇతడిపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి లోతుగా విచారణ చేస్తున్నారు.