PSLV-C51: నింగిలోకి దూసుకెళ్లిన 19 ఉపగ్రహాలు, భగవద్గీత

383

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం ఉదయం 10.24 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ -సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ పీఎస్‌ఎల్‌వీ -సీ51 ప్రయోగం చేపట్టింది. భగవద్గీత కాపీ, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో, పేరు, ఆత్మనిర్భర్‌ మిషన్‌ పేరు, 25వేల మంది పేర్లను.. అమెజానియా-1 శాటిలైట్‌తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను రాకెట్‌ నింగిలోకి మోసుకు వెళ్లింది.

న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ నేతృత్వంలో నింగిలోకి పంపగా తొలి వాణిజ్య ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ కక్షలో ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మూడు దశలు విజయవంతమయ్యాయి. బ్రెజీలియన్‌ శాటిలైట్‌ అమెజానియా-1 భూపర్యవేక్షణకు కీలకం కాగా.. అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌–1 నానో కాంటాక్ట్‌–2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీశ్‌ ధావన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలు ఈ ప్రయోగంలో ఉన్నాయి.

PSLV-C51: నింగిలోకి దూసుకెళ్లిన 19 ఉపగ్రహాలు, భగవద్గీత