నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం

73

టాలీవుడ్‌ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు గవర సురేష్‌ అనారోగ్యంతో మరణించారు. ఆయన కిడ్నీ వ్యాధి భారిన పడ్డారు. రెండు కిడ్నీలు ఫెయిలవ్వడంతో బెంగుళూరులోని ప్రైవేటు ఆసుప్రతిలో చేర్పించారు కుటుంబసభ్యులు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి అస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు సురేష్. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. కాగా సురేష్ ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.