ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ?

357

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అంటే, పార్టీలో అనేక మార్పు చెయ్యాల్సి ఉంటుంది. తాత్కాలిక అధ్యక్షులతో కొనసాగుతున్న పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని నియమించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆ పార్టీ మనుగడ సాగించే పరిస్థితి లేదు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు.. ఇక ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఆ పార్టీ వర్గాలు బలంగా కోరుతున్నాయి.

కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కార్తీ చిదంబరం చెబుతున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి పార్లమెంట్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చెయ్యాలని చిదంబరం కోరుతున్నారు. ఏప్రిల్ 6న ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నేత, కన్యాకుమారి సిట్టింగ్ ఎంపీ వసంత కుమార్ కోవిడ్-19తో మృతి చెందటంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కార్తి చిదంబరం కోరారు. ఈ మేరకు ఆమెను అభ్యర్థిగా ప్రకటించాలని తాను రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి వినతిపత్రం సమర్పించానని శుక్రవారం కార్తి చిదంబరం తెలిపారు.

ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ