ముగిసిన ప్రివిలేజ్ కమిటీ సమావేశం.. టీడీపీ నోటీసుపై చర్చ లేదు..

48

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం సిఫారసు ద్వారా వచ్చిన నోటీసులపై కమిటీ చర్చించింది. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై సీఎం జగన్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
నిబంధనలకు అనుగుణంగా తమకందిన నోటీసులపై మాత్రమే విచారణ చేశామని..

టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులు తమకు అందలేదని కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. టీడీపీ సభ్యులు తమపై వచ్చిన ఆరోపణలపై జనవరి 10 లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించామని కాకాని అన్నారు. అయితే సీఎం జగన్ తోపాటు మంత్రి కన్నబాబుపై తామిచ్చిన నోటీసులపై కమిటీ ఎందుకు చర్చించలేదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కమిటీని ప్రశ్నించారు.