నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

71

నెల్లూరు జిల్లాలో రోడ్ ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. చెన్నై నుంచి కోల్ కత్తా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

కాగా ఈ బస్సులో పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముషీరాబాద్ కు చెందిన వలస కూలీలు ఉన్నారు. గాయపడిన వారిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటన స్థలికి వచ్చిన పోలీసులు.. బోల్తా పడిన వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి.. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.