పుదుచ్చేరి పగ్గాలు తమిళిసై చేతిలోకి

308

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన విషయం విదితమే.. ఫిబ్రవరి 22 న జరిగిన బలపరీక్షలో కాంగ్రెస్ విఫలమైంది. దింతో అక్కడ రాష్ట్రపతి పాలనా కోరుతూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాష్ట్రపతికి లేఖ రాశారు. గవర్నర్‌ పంపిన లేఖను కేంద్ర కేబినెట్‌ నేడు ఆమోదిస్తూ.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పుదుచ్చేరి అసెంబ్లీలో 33 స్థానాలు ఉండగా 2016 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి విజయమ్స్ ఆడించింది. ఈ 33 స్థానాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు నామినేట్ చేసిన వారు ఉంటారు. ఎన్నికలు 30 స్థానాలకు మాత్రమే జరుగుతాయి. కాగా తాజాగా ఇక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ కూటమికి చెందిన 6 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దింతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ప్రతిపక్షాలు బలనిరూపణ కోరగా ఈ నెల 22 న బలపరీక్ష నిర్వహించారు. ఈ బలపరీక్షలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నారాయణస్వామి ఓటమి చవిచూశారు. ఈయనకు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వం నిలబడాలి ఆంటే 14 ఓట్లు రావాల్సి ఉంది.

బల నిరూపణలో విఫలం కావడంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు లేఖను లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసైకి అందించారు. నారాయణస్వామి రాజీనామా విజ్ఞప్తిని తమిళిసై ఆమోదించారు. దింతో అక్కడ ప్రభుత్వం పడిపోయింది.. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి పాలన కోరుతూ తమిళిసై లేఖ రాశారు. రాష్ట్రపతి పాలన వస్తే ఇక్కడ బాధ్యతలు మొత్తం లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉన్న తమిళిసై నిర్వహించాల్సి ఉంటుంది.

పుదుచ్చేరి పగ్గాలు తమిళిసై చేతిలోకి